వ్యాట్ తగ్గించిన మహారాష్ట్ర
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్నికేంద్రం తగ్గించిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు తాము విధిస్తున్న వ్యాట్‌ను తగ్గిస్తున్నాయి. కేరళ, ఒడిషా, పుదుచ్చేరితోపాటు పలు రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి. తాజాగా మహారాష్ట్ర కూడా వీటిపై వ్యాట్‌ను తగ్గించింది. పెట్రోల్‌పై రూ. 2.08, డీజిల్‌పై రూ.1.44 చొప్పున వ్యాట్ తగ్గిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రకటించింది. ఈ తగ్గింపు వల్ల పెట్రోల్ నుంచి రూ.80 కోట్లు, డీజిల్ నుంచి రూ. 125 కోట్ల భారం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఏడాదికి రూ.2,500 కోట్ల రెవెన్యూ నష్టం ఉంటుందని పేర్కొంది. వ్యాట్ తగ్గించిన తరవాత ముంబైలో పెట్రోల్ లీటరు ధర రూ.109.27, డీజిల్ ధర రూ.95.84 అవుతుంది.