For Money

Business News

FIIలు అంతా పట్టుకెళ్ళిపోయారు

విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భారీ ఎత్తున మన దేశం నుంచి ఉపసంహరించుకున్నట్లు ఎంకే వెంచర్స్‌ వ్యవస్థాపకుడు మధు కేలా అన్నారు. 2010 నుంచి ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడులకన్నా అధిక మొత్తాన్ని గత ఎనిమిది నెలల్లో ఎఫ్‌ఐఐలు విత్‌ డ్రా చేసుకున్నట్లు ఆయన చెప్పారు. గ్రోత్‌ రేట్ వస్తుందని ఎనిమిదేళ్ళ నుంచి మార్కెట్‌ ఎదురు చూస్తోందని.. కాని ఇంకా రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మన మార్కెట్లు కూడా స్పందిస్తున్నాయని అన్నారు. మన మార్కెట్‌లో బుల్‌ రన్‌ ప్రపంచ మార్కెట్ల అప్‌ట్రెండ్‌లో భాగమని ఆయన అన్నారు. గడచిన ఎనిమిది నెలల్లో అంతర్జాతీయ మార్కెట్లలో ముఖ్యంగా టెక్‌ షేర్లలో 50 శాతం దాకా షేర్లు 50 శాతంపైగా పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మన మార్కెట్లలో కూడా 30 శాతం కంపెనీల షేర్లు 50 శాతంపైగా క్షీణించాయని ఆయన అన్నారు. ఇన్వెస్టర్లు తమకు నమ్మకం ఉన్న షేర్లలో పెట్టుబడి కొనసాగించాలని… పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఒక్కసారి పెట్టుబడి పెట్టిన తరవాత మార్కెట్‌ హంగామాను పట్టించుకోవదన్నారు.
అత్యంత కీలక అంశాలను మధు కేల ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ఈ వీడియో మొత్తం తప్పక చూడండి.