For Money

Business News

లాభాల్లో డెలిహివరీ ఐపీఓ

మరో పబ్లిక్‌ ఇష్యూ ఇన్వెస్టర్లను ఓపెనింగ్‌లో నిరాశపర్చినా.. నిమిషాల్లోనే లాభాల్లోకి వచ్చింది. ఆరంభంలో రూ. 467.50ని తాకినా వెంటనే కోలుకుని 5 శాతంపైగా లాభంతో 523.95ని తాకింది. ఇపుడు 4.5 శాతం లాభంతో రూ. 509.20 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీకి చెందిన లాజిస్టిక్‌ కంపెనీ డెలిహివరీ లిమిటెడ్‌ రూ.487లకు ఒక్కో షేర్‌ను ఆఫర్ చేసింది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 5235 కోట్లు సమీకరించింది. ఈ కంపెనీ పబ్లిక్‌ ఆఫర్‌ కేవలం 1.63 రెట్లు మాత్రమే ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. రీటైల్‌ ఇన్వెస్టర్ల భాగం 57 శాతమే సబ్‌స్క్రియిబ్ అయింది. ఇక ఉద్యోగుల వాటా కేవలం 27 శాతం మాత్రమే సబ్‌స్క్రయిబ్ అయింది. దీంతో ప్రస్తుత ధర వద్ద ఈ షేర్‌ నిలబడుతందా లేదా అన్నది చూడాలి.