L&Tఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ విలీనం?
L&Tకి చెందిన L&T ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ కంపెనీలు విలీనం అవుతున్నట్లు మార్కెట్‌లో వార్తలు వస్తున్నాయి. రెండూ ఒకే గ్రూప్ కంపెనీలు కాబట్టి… షేర్ల మార్పిడి ద్వారా ఈ రెండింటి ఒక్కటి చేయాలని L&T భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2019లో మైండ్‌ట్రీని L&T కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థలో L&Tకి దాదాపు 61 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ మార్కెట్ విలువ 830 కోట్ల డాలర్లు. L&Tఇన్ఫోటెక్‌లో L&Tకి 74 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ మార్కెట్ విలువ 1360 కోట్ల డాలర్లు. రెండు కంపెనీల వ్యాపారం, క్లెయింట్లు భిన్నం కాబట్టి… విలీనం వల్ల ప్రయోజనమేగాని… నష్టం కాదని L&T భావిస్తోంది. నిన్న మైండ్‌ట్రీ ఆర్థిక ఫలితాలు ప్రకటించగా ఇవాళ L&Tఇన్ఫోటెక్ ఫలితాలు ప్రకటించనుంది. విలీనానికి సంబంధించి ఇవాళ వార్త వచ్చే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. మైండ్‌ట్రీ
ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌తో విలీన వార్తలు ఊహాగానాలేనని మైండ్‌ట్రీ ప్రకటించింది.