ఆ స్కీమ్ వారికి… గ్యాస్ సబ్సిడీ ఇస్తాం
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ పొందినవారికి ఒక్కో సిలెండర్‌పై రూ. 200 చొప్పున సబ్సిడీ ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇలా ఏడాదికి మొత్తం 12 సిలెండర్లకు సబ్సిడీ ఇస్తారని పేర్కొన్నారు. దీనివల్ల 9 కోట్ల మంది లబ్దిదారులకు దీనివల్ల ప్రయోజనం కల్గింది. ఈ సబ్సిడీ కింద రూ. 6100 కోట్లను కేంద్రం అందిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.