For Money

Business News

పెట్టుబడుల కోసం అమెరికాకు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబదులను ఆకర్షించేందుకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోంది. దేశంలో మొట్ట మొదటి సమగ్ర గ్రీన్‌ ఎనర్జి పాలసీతోపాటు పలు పారిశ్రామిక విధానాలకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పారిశ్రామికవేత్తలకు రెడ్‌కార్పెట్‌ పర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబు మీడియాతో అన్నారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న తరవాత రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ ఇపుడు పెట్టుబడుల ఆకర్షణ కోసం విదేశాలకు పయనమౌతున్నారు. ఈనెల 25 నుంచి అమెరికాలో ఆయన పర్యటించనున్నారు. ఆయన పర్యటన వచ్చే నెల 1వ తేదీ వరకు కొనసాగనుంది.తన పర్యటనలో భాగంగా శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో పలువురు పారిశ్రామికవేత్తలతో లోకేశ్ భేటీకానున్నారు. శానిఫ్రాన్సిస్కోలో జరిగే 9వ ఐటీ సర్వ్ సినర్జీ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొంటారు. ఈ సదస్సులో పాల్గొనే పలు బహుళజాతి కంపెనీల సీఈఓలకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త పారిశ్రామిక విధానాలను వివరించనున్నారు. లాస్‌ వెగాస్‌లో జరిగే ఐటీ సర్వ్‌ అలయన్స్‌ ఈవెంట్‌ కూడా ఆయన పాల్గొంటారు. ముఖ్యంగా ప్రముఖ ఐటీ కంపెనీలతో కూడా ఆయన భేటీ అవుతారని తెలుస్తోంది. వైజాగ్‌లో టీసీఎస్‌ను తీసుకు రావడంలో సక్సెస్‌ అయిన లోకేష్‌… పలు ఐటీ కంపెనీలను రాష్ట్రానికి రప్పించడం ద్వారా వైజాగ్‌ ఐటీ హబ్‌ను మరింత ముందుకు తీసుకెళతారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.