లిస్టింగ్ రోజున ఆసక్తి
ఆర్బీజడ్ జువెల్లర్స్ షేర్లు ఇవాళ లిస్టయ్యాయి. చిత్రంగా ఈ షేర్‌కు రీటైల్ ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వచ్చినా.. లిస్టింగ్ షేర్ ఇష్యూ ధరకు దిగువకు వచ్చింది. ఈ షేర్‌ను కంపెనీ రూ. 100లకు అలాట్ చేసింది. ఇష్యూలో 16 రెట్లకు పైగా ఓవర్ సబ్స్క్రయిబ్ అయినా… లిస్టింగ్ రోజున అలాట్మెంట్ ధర రూ. 100 వద్దే లిస్టయింది.ఆ వెంటనే ఈ షేర్ ధర రూ. 96లకు పడిపోయింది. ఈ స్థాయిలో వచ్చిన కొనుగోళ్ళ మద్దతు చివరిదాకా కొనసాగింది. ఇటీవల జువెలర్స్ షేర్లకు మంచి డిమాండ్ వస్తోంది. దీంతో షేర్ కొన్ని నిమిషాల్లోనే రూ. 105 అంటే 5 శాతం అప్పర్ సర్క్యూట్‌కు చేరుకుంది. ఇదే ధర వద్ద క్లోజైంది. ఎన్ఎస్ఈలో ఈ ధర వద్ద 3.43 లక్షల షేర్లకు డిమాండ్ ఉంది. అయితే అమ్మకందారులు లేరు. మరి ఈ షేర్ మున్ముందు ఎలా ట్రేడవుతుందో చూడాలి. ఎందుకంటే ఈ ఇష్యూపై స్టాక్ మార్కెట్ అనలిస్టులు పెద్దగా ఆసక్తి చూపలేదు.