బ్యాడ్ బ్యాంక్‌కు 15 ఖాతాలు బదిలీ
కొత్తగా ప్రారంభించిన నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (NARCL)కు 15 ఖాతాలు బదిలీకి బ్యాంకులు సిద్ధపడినట్లు తెలుస్తోంది. నిజానికి 22 ఖాతాలు బదిలీ చేయాలని అనుకున్నా..వీటిలో 7 ఖాతాలు NARCL వెలుపలే పరిష్కారమౌతాయని బ్యాంకులు భావిస్తున్నాయి. దీంతో మిగిలిన 15 ఖాతాలను బ్యాడ్ బ్యాంక్‌కు బదిలీ చేస్తాయి. వీటిలో వీడియోకాన్ గ్రూప్‌నకు చెందిన VOVL కంపెనీ, జేపీ ఇన్ఫ్రా కూడా ఉంది. హైదరాబాద్‌కు చెందిన మీనాక్షి ఎనర్జి, మధుకాన్ గ్రూప్‌నకు చెందిన ఛప్రా హాజీపూర్ ఎక్స్‌ప్రెస్‌వేస్ కూడా ఉంది. వీటిలో అత్యధికంగా VOVL కంపెనీ రూ.22,128 కోట్లు బకాయి ఉంది. మార్చిలోగా ఈ ఖాతాల బదిలీ ఉంటుంది.
15 ఖాతాల జాబితా:
VOVL (వీడియోకాన్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ) లిమిటెడ్: రూ. 22,128 కోట్లు
జేపీ ఇన్ఫ్రా: రూ. 7,950 కోట్లు
GTL లిమిటెడ్: రూ. 4,866 కోట్లు
వీసా స్టీల్: రూ. 3,394 కోట్లు
మీనాక్షి ఎనర్జీ (హైదరాబాద్): రూ. 2,799 కోట్లు
కన్సాలిడేటెడ్ కన్స్ట్రక్షన్ కన్సార్టియం: రూ. 1,353 కోట్లు
సియాన్ పన్వెల్ టోల్వేస్: రూ. 1,262 కోట్లు
రెయిన్బో పేపర్స్: రూ. 1,136 కోట్లు
సుప్రీం పన్వెల్ ఇందాపూర్ టోల్‌వే: రూ. 904 కోట్లు
హీలియస్ ఫోటో వోల్టాయిక్: రూ. 851 కోట్లు
ఛప్రా హాజీపూర్ ఎక్స్‌ప్రెస్‌వేస్ (మధుకాన్ గ్రూప్) : రూ. 846 కోట్లు
మిట్టల్ కార్పొరేషన్: రూ. 842 కోట్లు
వరల్డ్స్ విండో ఇంపెక్స్ ఇండియా: రూ. 742 కోట్లు
రుచి వరల్డ్‌వైడ్: రూ. 715 కోట్లు
SSA ఇంటర్నేషనల్: రూ. 547 కోట్లు