ఎల్‌ఐసీ మార్కెట్ వ్యాల్యూ రూ.22 లక్షల కోట్లు!
ఒక ప్రభుత్వ రంగ ఈ స్థాయికి ఎదగడం ఎంత గొప్పవిషయం అనిపిస్తుంది… దాని మార్కెట్ వ్యాల్యూ చూస్తుంటే. ఇవాళ సెబి వద్ద పబ్లిక్ ఆఫర్‌కు సంబంధించిన ప్రాస్పెక్టస్‌ను ఎల్‌ఐసీ దాఖలు చేసింది. ఈ డాక్యమెంట్ ప్రకారం ఎల్‌ఐసీ ఎంబెడెడ్ వ్యాల్యూ రూ. 5,39,686 కోట్లు. డాలర్లలో లెక్కిస్తే 7200 కోట్ల డాలర్లు. అమెరికాకు చెందిన మిలిమ్యాన్ అనే సంస్థ ఈ విలువ గట్టింది. అంతర్జాతీయంగా బీమా కంపెనీల విలువ కట్టేందుకు ఏ ఫార్ములా ఉపయోగిస్తారో… అదే ఫార్ములా ఉపయోగించి ఎల్‌ఐసీ ఎంబెడెడ్ వ్యాల్యూను లెక్కింది. సాధారణంగా ఎంబెడెడ్ వ్యాల్యూకు నాలుగు రెట్ల మొత్తాన్ని మార్కెట్ వ్యాల్యూగా పరిగణిస్తారు. అంటే ఎల్‌ఐసీ మార్కెట్ వ్యాల్యూ 28,800 కోట్ల డాలర్లు లేదా మన కరెన్సీలో రూ. 22 లక్షల కోట్లు అన్నమాట. మార్కెట్ వ్యాల్యూ ప్రకారం దేశంలో అతి పెద్ద కంపెనీగా ఎల్‌ఐసీ అవతరించింది. రిలయన్స్ మార్కెట్ వ్యాల్యూయేషన్ రూ.16 లక్షల కోట్లు. పబ్లిక్ ఆఫర్ ద్వారా 31,62,49,885 షేర్లను ప్రభుత్వం విక్రయించనుంది. మరి ఒక్కో షేర్‌ను ప్రభుత్వం ఏ ధరకు విక్రయిస్తుందనే దానిని బట్టి… ఎల్‌ఐసీ మార్కెట్ వ్యాల్యూ లెక్కగట్టొచ్చు.