For Money

Business News

పాలసీదారులకు 10% షేర్లు రిజర్వ్‌

తన పాలసీదారులకు పబ్లిక్‌ ఆఫర్‌లో పది శాతం వాటాలను రిజర్వ్‌ చేసింది ఎల్‌ఐసీ. పబ్లిక్‌ ఇష్యూకు సంబంధించిన ప్రాస్పెక్టస్‌ను ఇవాళ సెబీ వద్ద దాఖలు చేసింది ఎల్‌ఐసీ. ఇందులో ప్రధాన అంశాలను పరిశీలిస్తే పాలసీదారులకు పది శాతం మించకుండా షేర్లను కేటాయించాలని నిర్ణయించింది. అలాగే సంస్థ ఉద్యోగులకు అయిదు శాతం వాటాలను రిజర్వ్‌ చేస్తారు. మరి వీరికి ఏ మేరకు డిస్కౌంట్‌ ఇస్తారనేది… ఇష్యూ ప్రారంభానికి రెండు రోజుల ముందు వెల్లడిస్తారు. ఎల్‌ఐసీకి చెందిన ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పాలసీలు ఉన్నవారు ఈ పబ్లిక్‌ ఆఫర్‌లో తమ కేటగిరి షేర్లకు దరఖాస్తు చేసేందుకు అర్హులు. అయితే గరిష్ఠంగా రూ.2 లక్షలు విలువైన షేర్లకు మాత్రమే వీరు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అలాగే పాలసీదారులందరూ ఫిబ్రవరి28వ తేదీ కల్లా తమ పాలసీలకు పాన్‌ నంబర్‌ను లింక్‌ చేయాల్సి ఉంటుంది. అలా చేయనివారు దరఖాస్తు చేయలేరు. అలాగే వీరికి డిమాట్‌ అకౌంట్‌ కూడా కచ్చితంగా ఉండాలి. పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా ఎల్ఐసీ 31.6 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయనుంది.