For Money

Business News

ఎల్‌ఐసీ ఐపీఓ ధర శ్రేణి రూ. 902-రూ.949

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ మేనెల 4వ తేదీన ప్రారంభం కానుంది. మే9వ తేదీన క్లోజ్‌ కానుంది. సవరించిన ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసేందుకు సెబి అనుమతి లభించింది. ఈనెల 27న సవరించిన ప్రాస్పెక్టస్‌ను ఎల్‌ఐసీ దాఖలు చేయుంది. ఈ ఇష్యూ కింద కంపెనీ ఈక్విటీలో 3.5 శాతం షేర్లను ప్రభుత్వం పబ్లిక్‌కు ఆఫర్‌ చేయనుంది. ఒక్కో షేర్‌ ధర శ్రేణిని (Price Band) రూ.902 – రూ. 949గా నిర్ణయించినట్లు సమాచారం. పబ్లిక్‌ ఆఫర్‌ కింద 22.13 కోట్ల షేర్లను ఆఫర్‌చేస్తున్నారు. పాలసీదారులకు ఒక్కో షేరుకు రూ. 60 డిస్కౌంట్‌ లభిస్తుంది. రూ. 949 ధరకు షేర్లను ఎల్‌ఐసీ ఆఫర్‌ చేసే పక్షంలో ప్రభుత్వానికి రూ. 21000 కోట్లు రానున్నాయి.ఉద్యోగులు, రీటైల్‌ ఇన్వెస్టర్లకు రూ.40 డిస్కౌంట్‌ ఇస్తారు. యాంకర్‌ బుక్‌ మే4న తెరుస్తారు. ఇక ఇష్యూలో పది శాతం పాలసీహోల్డర్లకు కేటాయిస్తున్నారు.