తొలిరోజే రూ. 42,500 కోట్ల నష్టం
ఎల్ఐసీ తొలి రోజే ఇన్వెస్టర్లకు భారీ నష్టలను మిగిల్చింది. ముఖ్యంగా సంస్థాగత ఇన్వెస్టర్లందరూ భారీగా నష్టపోగా… రీటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులు కూడా ఒక మోస్తరుగా నష్టపోయాయి. స్వల్ప నష్టాలతో పాలసీదారులు బతికి పోయారు. ఇష్యూ ఆఫర్ ధర రూ.949 కాగా ఈ షేర్ ఎన్ఎస్ఈలో రూ.872, బీఎస్ఈలో రూ. 867.2 వద్ద లిస్టయింది. అక్కడి నుంచి భారీగా క్షీణించి రూ.860కి పడింది. దీంతో బీఎస్ఈలో ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,00,242 కోట్ల నుంచి రూ.5,57,675 కోట్లకు పడిపోయింది. అంటే ఇన్వెస్టర్లు రూ.45,000 కోట్లకుపైగా నష్టపోయారు. ప్రస్తుతం ఈ షేర్ రూ.886 వద్ద ట్రేడవుతోంది. ఈ లెక్కన ఈ ఇష్యూకు సబ్స్క్రయిబ్ చేసినవారందరూ నష్టాల్లో ఉన్నారు. ఈ ఇష్యూలో అతి తక్కువ ధరకు అంటే రూ.889లకు పాలసీదారులు షేర్లు కొన్నారు. వీరు కూడా ఇపుడు నష్టాల్లో ఉన్నారు. ఇష్యూ కోసం దరఖాస్తు చేసి.. షేర్లు రానివారు ఇపుడు తక్కువ ధర వద్ద కొనే అవకాశముంది. క్లోజింగ్ సమయానికి షేర్ కోలుకోవచ్చని కొంత మంది అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రముఖ విదేశీ బ్రోకింగ్ సంస్థ మాక్వెరీ ఎల్ఐసీ షేర్ టార్గెట్ ధర రూ.1000గా పేర్కొంది.