మార్చి 10న ఎల్‌ఐసీ ఐపీఓ?
పబ్లిక్ ఆఫర్‌లో పాల్గొనే పాలసీ దారులను తమ పాన్‌ను ఈనెలాఖరులోగా అప్‌డేట్ చేసుకోవాలని ఎల్‌ఐసీ ప్రకటించింది.దీంతో ఈ నెలలో పబ్లిక్ ఆఫర్ ప్రారంభమయ్యే అవకాశం లేదు. మొదటివారంలో కూడా పబ్లిక్ ఆఫర్ ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. పబ్లిక్ ఆఫర్ వచ్చేనెల 10న ప్రారంభమై 14న ముగిసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలను పేర్కొంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలాగే ఇష్యూ ద్వారా ఎంత సమీకరించాలని అనుకుంటున్నదీ షేర్ ధరల శ్రేణిని బట్టి ఉంటుంది. కేవలం ఎన్ని షేర్లు అమ్ముతున్నదీ ఎల్‌ఐసీ పేర్కొంది. దీంతో మార్కెట్‌లో ఇష్యూ ధరల శ్రేణిపై అనేక రకాల ఊహాగాలు వస్తున్నాయి. ధరల శ్రేణిలో కనీస ధర రూ.2,000కంటే ఎక్కువే ఉండొచ్చని తెలుస్తోంది. మార్చి రెండోవారంలో ఈ ఇష్యూ ప్రారంభమైతే… లిస్టింగ్ కూడా అదే నెలలో పూర్తవుతుంది. దీంతో ఇష్యూ ద్వారా వచ్చే మొత్తం సొమ్మును ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఖాతాల్లో ప్రభుత్వం రాయనుంది.