7 శాతం క్షీణించిన లారస్ ల్యాబ్
ఇవాళ అనేక ఫార్మా కంపెనీల షేర్లు పెరుగుతుండగా హైదరాబాద్‌కు చెందిన లారస్ ల్యాబ్ షేర్ 7 శాతం నష్టంతో ట్రేడవుతోంది. దక్షిణాఫ్రికా ప్రభుత్వం కుదిరిన కాంట్రాక్ట్ కంపెనీకి నెగిటివ్‌గా మారినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ కాంట్రాక్ట్‌లో కంపెనీ కేవలం సరఫరాదారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ పొందిన కంపెనీ ధరలను బాగా తగ్గించిందని.. దీనివల్ల లారస్ కంపెనీ మార్జిన్లు బాగా తగ్గుతాయని కొటక్ అంటోంది. దీంతో ఈ షేర్‌ను సెల్ రెకమెండేషన్ ఇచ్చింది. కొటక్ టార్గెట్ రూ. 350. ఈ షేర్ ఇవాళ ఇప్పటికే ఏడు శాతం క్షీణించి రూ.420ని తాకింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ షేర్ ధర రూ. 626. అంటే దాదాపు రూ. 200పైన క్షీణించిందన్నమాట. అయితే మార్కెట్ మాత్రం లారస్ పట్ల నెగిటివ్‌గా ఉన్నా కొటక్ చెప్పిన స్థాయికి ఈ షేర్ పడదని అంటున్నారు. స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శరద్ అవస్తీ ఈ షేర్ గురించి సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్లో మాట్లాడుతూ… ప్రస్తుత స్థాయిలో లారస్ ల్యాబ్‌ను కొనుగోలు చేయాలని సలహా ఇచ్చారు. ఇది మంచి అవకాశమని అన్నారు. దక్షిణాఫ్రికా కాంట్రాక్ట్ ప్రభావం కంపెనీపై ప్రతికూలంగా ఉన్నా… అది మరీ పెద్ద అంశం కాదని ఆయన అన్నారు. అమెరికా, యూరప్‌ల నుంచి కంపెనీ వ్యాపారం బాగుంటుంని అవస్తి అంటున్నారు. ఏడాది, ఏడాదిన్నర కాలం వెయిట్ చేసే ఇన్వెస్టర్లకు లారస్ మంచి అవకావమని ఆయన అన్నారు. దీర్ఘకాలిక టార్గెట్ రూ. 550గా ఆయన పేర్కొన్నారు. ఈ స్థాయి నుంచి దిగువకు ఏమాత్రం పడినా.. కొనుగోలుకు ఛాన్స్ అని అవస్తి చెప్పారు.