For Money

Business News

18600పైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి లాభాలతో ట్రేడవుతోంది. ఓపెనింగ్‌లో 18552ని తాకినా క్షణాల్లో… నిఫ్టి గ్రీన్‌లోకి వచ్చింది. నిఫ్టి ప్రస్తుతం 18601 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 39 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టిలో 38 షేర్లు గ్రీన్‌లో ఉన్నా… షేర్ల ధరల్లో పెద్ద మార్పు లేదు. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ మాత్రం నష్టాల్లోఉంది. పేటీఎం షేర్‌ను సీఎల్‌ఎస్‌ఏ కూడా ఇవాళ బై సిఫారసు చేసింది. దీంతో ఈ షేర్‌ మూడు శాతం దాకా పెరిగింది. నైకా, జొమాటొ షేర్లు స్థిరంగా ఉన్నాయి. ఇక బ్యాంకు షేర్లలో కూడా పెద్ద మార్పు లేదు.