చివర్లో జంప్…
ఉదయం ఆరంభంలోనే నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి దాదాపు రోజంతా నష్టాల్లో ఉంది. మిడ్ సెషన్ సమయంలో గ్రీన్‌లోకి వచ్చినా వెంటనే నష్టాల్లోకి జారుకుంది. సరిగ్గా 2.30 గంటలకు మార్కెట్ ఒక్కసారిగా పుంజుకుంది. 18135 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివర్లో స్వల్పంగా తగ్గి 18117 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 64 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ 115 పాయింట్లు మాత్రమే లాభపడింది. నిఫ్టికి ఎపుడూ అండగా ఉండే నిఫ్లి బ్యాంక్ ఇవాళ నష్టాల్లో ముగిసింది. అలాగే నిఫ్టి మిడ్ క్యాప్ కూడా. మిడ్ సెషన్ తరవాత యూరో మార్కెట్లు ఒక శాతంపైగా లాభంలోకి వచ్చాయి. అలాగే అమెరికా ఫ్యూచర్స్ కూడా గ్రీన్‌లోకి వచ్చాయి. బై ఆన్ డిప్ ఫాలో అయిన వారు ఇవాళ బాగా లబ్ది పొందారు. సెషన్ చివర్లో అదానీ ఎంటర్‌ప్రైజస్‌కు అనూహ్య మద్దతు అందడంతో ఆ షేర్ ఆరున్నర శాతం లాభంతో ముగిసింది. అలాగే హిందాల్కో, బజాజ్ ఫిన్ సర్వ్ కూడా నాలుగు శాతంపైగా లాభ పడ్డాయి. గత కొన్ని రోజులుగా ఒత్తిడిలో ఉన్న మెటల్స్, సిమెంట్ షేర్లు పుంజకున్నాయి. వేదాంత ఆరున్నర శాతం లాభపడింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన ఎస్బీఐ దాదాపు 2 శాతం లాభంతో ముగిసింది. ఎస్బీఐ ఆల్‌టైమ్ హైలో క్లోజ్ కావడం విశేషం.