For Money

Business News

24న మార్కెట్‌లోకి ఉరోస్‌ పెర్ఫామెంటే

ఎస్‌యూవీ రంగంలో ఉరోస్‌తో లాంబొర్గిని సంచలనం రేపింది. ఇపుడు ఉరోస్‌ పెర్ఫామెంటేను మార్కెట్‌లోకి తెస్తోంది. ఈనెల 24వ తేదీన భారత మార్కెట్‌లో లాంఛ్‌ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇపుడు మార్కెట్‌లో ఉన్న ఆస్టన్​ డీబీఎక్స్​ 707, పార్షె కయెన్నె కూప్​ టర్బో జీటీ, మసెరాటి లెవంటె ట్రోఫియో వాహనాలకు లాంబొర్గిని కొత్త మోడల్‌ గట్టి పోటీనిస్తుందని ఆటో మార్కెట్​విశ్లేషకులు అంటున్నారు. 0-100 కి.మీ.ల వేగాన్ని కేవలం 3.3 సెకన్లలో ఈ ఎస్‌యూవీ చేరుకుంటుంది. దీని టాప్​స్పీడ్​గంటలకు 306 కి.మీ. సాధారణ ఉరస్‌ కన్నా దీని ఉరోస్‌ పెర్ఫామెంటే బరువు తక్కువగా ఉంటుంది. బరువు తగ్గడంతో ఇంజిన్​ ప్రదర్శన మెరుగ్గా ఉందని ఈ కార్‌ను టెస్ట్‌ చేసినవారు అంటున్నారు.ఈ సూపర్​ కార్​ బరువు 2,150కేజీలు. ఇండియాలో ఈ కారు ప్రారంభ ధర రూ. 5కోట్లుగా ఉండొచ్చు.