ఎలక్ట్రిక్ ‘లూనా’ వచ్చేస్తోంది..
సరిగ్గా 50 ఏళ్ళ క్రితం మార్కెట్లో లూనా వచ్చింది. ఇపుడు ఎలక్ట్రిక్ ‘లూనా’ రాబోతోంది. తమ అనుబంధ సంస్థ అయిన ‘కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్’ ఈ ‘ఇ-లూనాను తీసుకురానున్నట్లు కెనటిక్ గ్రూప్ తెలిపింది. లూనాకు సంబంధించిన ఛాసిస్ సహా ఇతర విడిభాగాల తయారీని ‘కైనెటిక్ ఇంజినీరింగ్ లిమిటెడ్ ప్రారంభించించింది. చాలా వరకు విడిభాగాలు తామే తయారు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. తొలుత నెలకు 5,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ప్రత్యేకంగా అసెంబ్లీ లైన్ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. వచ్చే 2- 3 ఏళ్లలో లూనా విక్రయాల ద్వారా అదనంగా రూ.30 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని కేఈఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అంజిక్య ఫిరోడియా అంచనా వేశారు.