జూబ్లియంట్ ఫుడ్ జూమ్… ఎందుకంటే?
మార్కెట్లో ఈతరం షేర్లలో చాలా యాక్టివ్గా ఉండే షేర్లలో ఒకటైన జూబ్లియంట్ ఫుడ్ షేర్ ఇవాళ ఒక్కసారిగా నష్టాల్లో నుంచి లాభాల్లోకి వచ్చేసింది. ఉదయం ఈ షేర్ రూ. 3860ని తాకింది.. ఈలోగా కంపెనీ తన షేర్ల ముఖవిలువను విభజించాలని నిర్ణయించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. దీంతో ఈ షేర్ ఒక్కసారిగా రూ. 4032కు చేరింది. ఇపుడు రూ. 3948 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం ఈ షేర్ ముఖ విలువ రూ. 10 కాగా, దీన్ని విభజించే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునేందుకు ఫిబ్రవరి 2న కంపెనీ బోర్డు సమావేశం కానుంది. మరి రెండుగా విభజిస్తారా లేదా అయిదు షేర్లుగా విభజిస్తారా అన్నది అదే రోజు తేలనుంది. ఇదే సమావేశంలో ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలను కూడా పరిశీలించనుంది.