అదానీకి పోటీగా జిందాల్
భారత్లోని తన సిమెంట్ వ్యాపారాన్ని అమ్మేస్తానని హోలిసిమ్ ప్రకటించినప్పటి నుంచి గుజరాత్ అంబుజా, ఏసీసీ కోసం భారత కంపెనీలు పోటీ పడుతున్నాయి. అత్యంత భారీ సామర్థ్యంతో పాటు లాభదాయకంగా ఉన్న గుజరాత్ అంబుజా, ఏసీసీని ఎలాగైనా దక్కించుకోవాలని అదానీ గ్రూప్ ప్రయత్నిస్తోంది. అపుడే నిధుల సమీకరణ ప్రయత్నాలు చూడా చేస్తోంది. ఈలోగా అంబుజా కోసం జిందాల్ గ్రూప్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇందుకోసం 700 కోట్ల డాలర్లతో ( రూ.54,000 కోట్ల) బిడ్ దాఖలు చేయడానికి జేఎస్బ్ల్యూ గ్రూపు రెడీ అవుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో 450 కోట్ల డాలర్లు సొంతంగా సమాకూర్చుకోనుంది. మిగిలిన 250 కోట్ల డాలర్లను ప్రైవేటు ఈక్విటీ సంస్థల ద్వారా సమకూర్చు కోనుందని సమాచారం . జేఎస్ డబ్ల్యూ గ్రూపు ఛైర్మన్ సజ్జన్ జిందాల్ ఈ టేకోవర్పైప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.