For Money

Business News

రియల్‌ ఎస్టేట్‌లో ఏ షేర్లు కొనొచ్చు?

వడ్డీ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ఇన్వెస్టర్లలో రియల్ ఎస్టేట్‌ రంగంపై అనేక రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవైపు వడ్డీ రేట్లు పెరుగుతుండగా, మరోవైపు అధిక ధరల కారణంగా జనం వద్ద డిస్పోజబుల్‌ ఇన్‌కమ్‌ తగ్గుతోంది. ఈ నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ రంగ షేర్లలో ఇన్వెస్ట్‌ చేయడంపై ఇన్వెస్టర్లు పునరాలోచిస్తున్నారు. ఈ రంగంపై తాజా పరిస్థితిపై జేపీ మోర్గాన్‌ పలు సూచనలు చేసింది. రియల్‌ ఎస్టేట్‌ రంగం సైకిల్ చాలా బలంగా ఉందని ఈ సంస్థ అంటోంది. ముఖ్యంగా రెసిడెన్షియల్‌ సైకిల్‌ పాజిటివ్‌గా మారిందని పేర్కొంది. ధరలు అందుబాటులో ఉన్నంత వరకు మార్కెట్‌ ఫండమెంటల్స్‌ బాగుంటాయని జేపీ మోర్గాన్‌ పేర్కొంది. లిస్టెట్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల మార్కెట్‌ వాటా క్రమంగా పెరుగుతోందని ఈ సంస్థ పేర్కొంది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో డీఎల్‌ఎఫ్‌ను కొనుగోలు చేయొచ్చని ఈ సంస్థ పేర్కొంది. ఈ షేర్‌ టార్గెట్‌ను రూ. 490గా పేర్కొంది. ప్రస్తుతం ఈ షేర్‌ రూ. 347.50 వద్ద ట్రేడవుతోంది. ఈ సంస్థ ఓవర్‌వైట్‌ ఉన్న మరో షేర్‌ ప్రిస్టేజ్‌ ఎస్టేట్స్‌. ఈ షేర్‌ ప్రస్తుతం రూ. 427.95 వద్ద ట్రేడవుతోంది. ఈ షేర్‌ టార్గెట్‌ను రూ. 635గా పేర్కొంది.