For Money

Business News

జోయాలుక్కాస్‌.. ప్రాస్పెక్టస్‌ దాఖలు

మార్కెట్‌ నుంచి రూ.2,300 కోట్ల నిధుల సేకరణకు జోయాలుక్కాస్‌ ఇండియా లిమిటెడ్‌ రెడీ అవుతోంది. క్యాపిటల్‌ మార్కెట్‌లో ప్రవేశించనున్న ఈ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు సంబంధించిన ప్రాస్పెక్టస్‌ను సెబీ వద్ద దాఖలు చేసింది. ఈ ఐపీవోలో భాగంగా కొత్తగా షేర్లను జారీ చేయనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్‌ ద్వారా సమీకరించే నిధుల్లో రూ.1,400 కోట్లను అప్పులు చెల్లించేందుకు ఉపయోగిస్తారు. అలాగే కొత్తగా మరో ఎనిమిది షోరూంలను ఏర్పాటు చేయడానికి రూ.463 కోట్లను ఫైనాన్స్‌ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. జోయా లుక్కాస్‌కు దక్షిణ భారతం నుంచి 90 శాతం ఆదాయం సమకూరుతోంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.471.75 కోట్ల లాభాన్ని గడించింది. అంతకు ముందు రూ.40 కోట్లతో పోలిస్తే పదింతలు పెరిగింది.