For Money

Business News

1.29 కోట్ల మంది జియోకు గుడ్‌బై

జియో అంటే కొత్తగా కస్టమర్లు చేరడమే తప్ప. తగ్గడం లేదు ఇప్పటి వరకు . కాని ఇపుడు జియో కస్టమర్లు కూడా గుడ్‌ బై చెబుతున్నారు. డిసెంబర్‌ నెలలో దేశవ్యాప్తంగా మొబైల్‌ వినియోగదారుల సంఖ్య 1.28 కోట్ల మంది తగ్గినట్లు ట్రాయ్‌ వెల్లడించింది. దీంతో మొత్తం మొబైల్‌ సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 115.46 కోట్లకు తగ్గారు. అంతకుముందు నెలలో 116.74 కోట్లుగా ఉన్నారు. ముకేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియోకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జియో నెట్‌వర్క్‌కు ఒక్క నెలలో 1.29 కోట్ల మంది గుడ్‌బై పలికారు. ఒక్క నెలలో ఇంతమందిని ఈ కంపెనీ కోల్పోవడం ఇదే తొలిసారి. దీంతో కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 41.57 కోట్లకు పడిపోయింది. అలాగే వొడాఫోన్‌ ఐడియా 16.14 లక్షల మందిని కోల్పోవడంతో ఆ కంపెనీ కస్టమర్ల సంఖ్య 26.55 కోట్లకు పరిమితమైంది. ఇక ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌లోకి కొత్తగా 4.75 లక్షల మంది రావడంతో వినియోగదారుల సంఖ్య 35.57 కోట్లకు చేరింది. ఇక బీఎస్‌ఎన్‌కు కూడా 12 లక్షల కొత్త కనెక్షన్లు వచ్చాయి. దీంతో ఆనెట్‌ వర్క్‌ కస్టమర్ల సంఖ్య 11.43 కోట్లకు పెరిగింది.