ప్రి పెయిడ్ కార్డులకు క్యాష్‌బ్యాక్ ఆఫర్
పండుగ సీజన్ ముందు రిలయన్స్ జియో ప్రి పెయిడ్ కార్డులకు 20 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఇది ఎంపిక చేసిన మూడు ప్యాకేజీలకు మాత్రమే వర్తిస్తుంది. పైగా రీచార్జిని MyJio యాప్ లేదా కంపెనీ వెబ్సైట్ నుంచి మాత్రమే చేసుకోవాలని. రూ.Rs. 249, రూ. 555, రూ. 599 ప్లాన్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ మూడు ప్యాన్లు 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్లు. ఈ ప్లాన్లకు రీచార్జి చేసుకున్న వెంటనే క్యాష్ బ్యాక్ మొత్తం సదరు ఖాతాదారు అకౌంట్‌కు క్రెడిట్ అవుతుంది. తరవాత రీచార్జి చేసుకునే సమయంలో ఈ మొత్తాన్ని వాడుకోవచ్చు.