జిందాల్ చేతికి మధుకాన్ గ్రూప్ కంపెనీ?
టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ గ్రూపులోని సింహపురి ఎనర్జీ లిమిటెడ్‌ను జిందాల్ పవర్ సొంతం చేసుకునే అవకాశముంది. సింహపురి పవర్‌కు ఏపీలోని నెల్లూరు జిల్లాలో 600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటు ఉంది. ఈ కంపెనీ బ్యాంకుల నుంచి రూ .2,500 కోట్ల మేరకు రుణాలు తీసుకుంది. అయితే ఈ ప్రాజెక్టు చాలా కాలంలగా మూతపడి ఉంది. రుణాలు వెనక్కి చెల్లించకపోవడంతో బ్యాంకులు ఎన్సీఎల్‌టీ ఆశ్రయించాయి. సింహపురి ఎనర్జీ వివిధ పార్టీలకు మొత్తం రూ .4,000 కోట్లకు పైగా రుణాలు బకాయి పడినట్లు తేలింది. ప్రస్తుతం ఈ కంపెనీని లిక్విడేట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఈ కంపెనీని టేకోవర్ చేసేందుకు జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన జిందాల్ పవర్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. రూ .300 కోట్లకు ఈ ప్లాంట్‌ను కొనేందుకు జిందాల్ పవర్ ఆసక్తి చూపుతోంది.