For Money

Business News

నిఫ్టికి ఐటీ షాక్‌

టీసీఎస్‌ ఫలితాలకు మార్కెట్‌ నెగటివ్‌గా స్పందించింది. శుక్రవారం టీసీఎస్‌ ఫలితాలు వెలవడగా, అదే రోజు అమెరికా మార్కెట్లలోఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ నాలుగు శాతంపైగా క్షీణించడంతో…. సోమవారం మన మార్కెట్‌లో ఐటీ షేర్లపై ఒత్తిడి ఉంటుందని స్పష్టమైంది. అదే విధంగా ఇవాళ ప్రధాన ఐటీ షేర్లన్నీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దీంతో రిలయన్స్‌ లాభాలు మార్కెట్‌ను కాపాడలేదు.దీంతో నిఫష్ట్ర్టి 17,884ని తాకిన వెంటనే 17,839 పాయింట్లను తాకింది. ప్రస్తుతం 17,872 వద్ద 22 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇవాళ ఆటో షేర్లన్నీ లాభాలతో ట్రేడవుతున్నాయి. కారణం తెలియడం లేదు. ఇక విద్యుత్ కొరత ఖాయమని తెలుస్తోంది. కోల్‌ఇండియా షేర్‌ భారీ లాభాల్లో ట్రేడవుతోంది. అలాగే విద్యుత్ కంపెనీల షేర్లు లాభాల్లో ఉన్నాయి. సో.. .రిలయన్స్‌, బొగ్గు, విద్యుత్, ఆటో షేర్లు నిఫ్టిని కాపాడుతున్నాయి.