ఇన్కమ్ ట్యాక్స్ ‘అలా’ కడుతున్నారా.. జీఎస్టీ తప్పదు
శవంపై తప్ప అన్ని చోట్లా జీఎస్టీని అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇన్కమ్ ట్యాక్స్‌ను మీరు క్యాష్ ద్వారా అంటే డెబిట్ కార్డ్ లేదా యూపీఏ ద్వారా కడితే సరే… లేకుంటే మీకు సర్వీస్ చార్జితో పాటు జీఎస్టీ కూడా తప్పదు. యూపీఏ లేదా డెబిట్ కార్డు ద్వారా కట్టడమంటే…నేరుగా మీ ఖాతాలో అప్పటికపుడు కట్టడమే. అలా కాకుండా మీరు పేమెంట్ గేట్‌వే ద్వారా అంటే నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా కడితే మాత్రం సర్వీస్ చార్జీతో పాటు జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. ఇన్‌ట్యాక్స్ వెబ్సైట్ ద్వారా మీరు ఈ ఫైలింగ్ చేస్తున్నపుడు పేమెంట్ సంగతి గమనించండి. నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లిస్తే లావాదేవీ చార్జీ బ్యాంకును బట్టి మారుతుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒక్కో లావాదేవీకి రూ. 12, ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 9, ఎస్బీఐ రూ. 7, యాక్సిస్ బ్యాంక్ రూ. 7 ఇతర బ్యాంకులు రూ.5 చార్జి చేస్తాయి. పైగా ఈ మొత్తంపై 18 శాతం జీస్టీ ఉంటుంది. అంటే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ద్వారా మీరు చెల్లిస్తే రూ.12 ప్లస్ 18 శాతం జీఎస్టీ అన్నమాట. అదే క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తే మీరు చెల్లించే ఇన్కమ్ ట్యాక్స్‌లో 0.85 శాతం కట్టాలి. పైగా దీనిపై కూడా 18 శాతం జీఎస్టీ ఉంటుంది. అంటే లక్ష రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే రూ.850 లావాదేవీ వ్యయం ప్లస్ 18 శాతం జీఎస్టీ కట్టాలి.