For Money

Business News

కుప్పకూలిన టర్కీ స్టాక్‌ మార్కెట్‌

ఒకవైపు 21 శాతం ద్రవ్యోల్బణం. దేశంలో అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా ఇలా ద్రవ్యోల్బణం పెరిగినపుడు వడ్డీ రేట్లను పెంచుతుంది.కాని టర్కీ ప్రభుత్వం ఇవాళ ఏకంగా ఒక శాతం వడ్డీ రేట్లను తగ్గించింది. కొత్త వడ్డీ కూడా 14 శాతం. ఇవాళ ఆ దేశ స్టాక్‌ మార్కెట్లు ఆరంభంలో అయిదు శాతంపైగా లాభంతో ఉన్నాయి. కాని వడ్డీ రేట్లను తగ్గించిన వెంటనే టర్కీ కరెన్సీ లిరా భారీగా క్షీణించింది. దీంతో స్టాక్‌ మార్కెట్‌లో షేర్ల ధరలు సర్క్యూట్‌ బ్రేకర్‌ను తాకాయి. 7 శాతం క్షీణిస్తే దీన్ని అమలు చేస్తారు. అంటే కాస్సేపు ట్రేడింగ్‌ ఆపేస్తారు. ఆ తరవాత మార్కెట్‌ ప్రారంభంకాగానే మళ్ళీ 9 శాతంపైగా షేర్ల ధరల సూచీ పడింది. దీంతో రెండోసారి షేర్లు, షేర్ల డెరివేటివ్స్‌, రుణ రెపో లావాదేవీలు ఆటోమేటిగ్గా నిలిచిపోయాయి.