For Money

Business News

FDలు విత్‌డ్రా చేసుకోవాలా?

ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ రేపు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఏకంగా అర శాతం మేర వడ్డీ రేట్లను గత నెలలో తగ్గించింది. అయితే మన ఆర్బీఐ మాత్రం రేపు వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల కొత్త రుణాలపై తక్కువ వడ్డీ వస్తుంది. చాలా వరకు రుణాలు ఫిక్సెడ్‌ రేటుపై లేవు. చాలా వరకు ఎప్పటికపుడు మారుతున్నాయి. వడ్డీ రేట్లు తగ్గిస్తే.. బ్యాంకుల వడ్డీ ఆదాయం తగ్గుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొంత సమయం తీసుకుని ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చు. మొత్తానికి ఫిక్సెడ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు ఇక ఎంతో కాలం ఉండవని బ్యాంకర్లు అంటున్నారు. వీలైతే డిపాజిటర్లు తమ ఎఫ్‌డీలను విత్‌డ్రా చేసుకోవడానికి ఇదే సరైన సమయమని పలువురు బ్యాంకర్లు సూచిస్తున్నారు. 2023 ఏప్రిల్‌లో వడ్డీ రేట్లను 6.5 శాతంగా ఉంచింది ఆర్బీఐ. అప్పటి నుంచి అంటే పది సమావేశాల్లో వడ్డీ రేట్లను మార్చకుండా ఉంచుతోంది. ఇలా చేయడం ఇంకెంతో కాలం కుదరదని బ్యాంకర్లు భావిస్తున్నారు. వచ్చే ఎంపీసీ సమావేశంలో లేదా ఆ మధ్యలోనే వడ్దీ రేట్లను ఆర్బీఐ మార్చవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. రేపటి సమావేశంలో వడ్డీ రేట్లను తగ్గించకున్నా… నిధుల లభ్యతను ఆర్బీఐ పెంచవచ్చని… దీంతో వడ్డీ రేట్లపై ఒత్తిడి తగ్గుందని బ్యాంకర్లు అంటున్నారు.

Leave a Reply