ఇపుడు ఐటీ షేర్లను కొనొచ్చా?
గత కొన్ని రోజుల నుంచి ఐటీ షేర్లు స్వల్పంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా డాలర్‌తో రూపాయి బలహీనపడటం… ఐటీ రంగానికి ప్లస్. దీనితో ఇవాళ చాలా మంది ఇన్వెస్టర్లు మక్కువ చూపుతున్నారు. దీనికి మరో కారణంగా ఈ కంపెనీ షేర్లు ఇప్పటికే బాగా క్షీణించి ఉండటం. అనేక షేర్లు 20 నుంచి 30 శాతం దాకా తగ్గాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. అయితే సీఎన్‌బీసీ టీవీ18 మేనేజింగ్ ఎడిటర్ అనూజ్ సింఘాల్ మాత్రం ఐటీ షేర్లలో ట్రేడింగ్ చేయొచ్చే కాని… ఇన్వెస్ట్మెంట్ వొద్దని సలహా ఇస్తున్నారు. కరోనా తరవాత నిఫ్టి రెట్టింపు అయితే… ఐటీ షేర్లు మూడింతలు పెరిగాయి… కొన్ని కంపెనీలు 600 శాతం పెరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ స్థాయిలో పెరిగిన షేర్లను కేవలం 30 శాతం తగ్గిన వెంటనే కొనడానికి పరుగులు పెట్టాల్సిన పనిలేదుని అన్నారు. ఐటీ రంగానికి డాలర్ -రూపాయి అనేది కేవలం సెంటిమెంట్‌ను బట్టి ఉంటుందని అన్నారు. మొత్తం అమెరికా ఐటీ రంగంలో ఇబ్బందుల్లో ఉందని…ఈ రంగం ఎక్కడికి వెళుతోంది.. ఏం చేయబోతోందనే అంశంపై ఇంకా అస్పష్టత ఉందని ఆయన అంటున్నారు. వచ్చేవారం పలు ప్రధాన ఐటీ కంపెనీలు ఫలితాలు ప్రకటిస్తున్నాయని… ఆ ఫలితాలతో పాటు వాటి కామెంట్స్‌ను కూడా పరిశీలించాలని ఆయన సలహా ఇస్తున్నారు. ఐటీ కంపెనీల్లో మరో 20 నుంచి 30 శాతం పడే అవకాశముందని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. ట్రేడర్లు ఎప్పటికపుడు నిర్ణయం తీసుకుని… క్షణాల్లో బయటపడారు. ఇన్వెస్టర్లు మాత్రం అలా చేయరు. కాబట్టి ఇన్వెస్టర్లు ఐటీ కంటే మ్యాన్యూఫ్యాకర్చింగ్, బ్యాంకింగ్ వంటి రంగాలను కూడా పరిశీలించవచ్చని ఆయన సలహా ఇచ్చారు.