For Money

Business News

ఐపీఎల్‌ ఆఫర్‌: జియో కొత్త ప్లాన్‌

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ మరో 3 రోజుల్లోనే ఆరంభం కానుంది. మార్చి 31న చెన్నై, గుజరాత్ మధ్య తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ మొదలవుతుంది. ఈసారి ఐపీఎల్ డిజిటల్ హక్కులను రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 మీడియా కంపెనీ దక్కించుకుంది. అంటే ఆండ్రాయిడ్ యూజర్లు జియోసినిమా యాప్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లను చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జియో కొత్త బ్రాడ్‌బ్యాండ్ ‘బ్యాకప్’ ప్లాన్‌ను ఆఫర్‌ చేస్తోంది. ఈ ‘బ్యాకప్’ ప్లాన్‌లో రూ.198తో రీఛార్జ్ చేసుకుంటే నెలంతా 10 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా పొందొచ్చని కంపెనీ వెల్లడించింది. అలాగే ఉచితంగా ల్యాండ్‌లైన్ కాల్స్ చేసుకోవచ్చని పేర్కొంది. ఇక 5 నెలల కనెక్షన్ కావాలనుకునేవారు రూ.1490తో రీచార్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త ప్లాన్ మార్చి 30 నుంచి అమల్లోకి రానుంది.