5 రోజుల్లో రూ. 20 లక్షల కోట్లు ఔట్!
స్టాక్ మార్కెట్ పెరగడమంటే.. కొండలు ఎక్కడమే. ప్రతి మెట్టూ కష్టపడుతూ ఎక్కాలి. కాని పడటం అంటే మాత్రం పై నుంచి దొర్లడమే. నిఫ్టి పతనం కూడా అలానే ఉంది. నిన్నటి దాకా రాత్రికి రాత్రే అమాంతంగా పెరిగిన ఇన్వెస్టర్ల సంపద అంతే స్పీడుతో మాయమైపోతోంది. కేవలం అయిదే అయిదు సెషన్స్‌లో ఇన్వెస్టర్ల సంపద రూ. 20 లక్షల కోట్లు తగ్గింది. కేవలం ఈ ఒక్క రోజే రూ. 9 లక్షల కోట్లను ఇన్వెస్టర్లు పొగొట్టుకున్నారు. దాదాపు అన్ని రంగాల షేర్లు ఇవాళ కుప్పకూలాయి. ముఖ్యంగా బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు నాలుగు శాతం చొప్పున పడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చిన అమ్మకాల ఒత్తిడి మన దేశంలోనూ కొనసాగింది. న్యూఏజ్ బిజినెస్‌కు ప్రతీకలుగా నిలిచిన జొమాటొ, నైకా, పీబీ ఫిన్‌టెక్, పే టీఎం, కార్ ట్రేడ్, ఫినొ పేమెంట్ బ్యాంక్ షేర్లు… తమ ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయిలో ట్రేడవుతున్నాయి.