For Money

Business News

రూ. 41,415 కోట్ల వడ్డీ సబ్సిడీ ఇచ్చాం

ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన స్కీమ్‌ కింద ఇప్పటి వరకు రూ. 41,415 కోట్ల వడ్డీ సబ్సిడీని ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర హౌసింగ్‌, అర్బన్‌ అఫైర్స్‌ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి వెల్లడించారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానం ఇస్తూ… దీనివల్ల 17.68 లక్షల లబ్దిదారులకు ప్రయోజనం కల్గిందన్నారు. 2022కల్లా అందరికీ ఇల్లు లక్ష్యంగా ఈ పథకాన్ని 2015లో ప్రధాని మోడీ ప్రారంభించారు. 2021-22 ఏడాదిలోనే రూ. 8000 కోట్ల ఈ పథకం కింద పట్టణ ప్రాంతాల వారికి మంజూరు చేశామని మంత్రి చెప్పారు. ఇందులో రూ. 1000 కోట్లు CLSS పరిహారం కింద ఇచ్చామని అన్నారు. సవరించిన బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని రూ. 27,000 కోట్లకు పెంచామని చెప్పారు. పట్టణ ప్రాంతంలో అర్హులైన లబ్దిదారులకు హౌసింగ్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పలు ప్రాజెక్టులకు కూడా ప్రభుత్వం సాయం చేస్తోందని అన్నారు.