For Money

Business News

చిన్న పొదుపు మొత్తాలపై వడ్డీ రేట్ల సవరణ

అక్టోబర్‌ 1వ తేదీ నుంచి చిన్న పొదుపు మొత్తాలపై అమలయ్యే వడ్డీ రేట్లను కేంద్రం ఇవాళ ప్రకటించింది. మెజారిటీ పొదుపు మొత్తాల పథకాల వడ్డీ రేట్లలో మార్పు లేదు. అయితే సీనియర్‌ సిటీజన్లకు ఇచ్చే వడ్డీని కాస్త పెంచారు. అలాగే రెండు, మూడు సంవత్సరాల డిపాజిట్లపై కూడా స్వల్పంగా వడ్డీ రేటు పెంచారు. అలాగే కిసాన్‌ వికాస్‌ పత్రపై ఇపుడు 6.9 శాతం వడ్డీ ఇస్తుండగా, ఇక నుంచి 7 శాతం వడ్డీ ఇస్తారు. కొత్త వడ్డీ రేట్ల డిసెంబర్‌ 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. ఇతర రేట్లు ఇలా ఉన్నాయి.
సేవింగ్ డిపాజిట్లట్‌… 4 శాతం వడ్డీ (మార్పు లేదు)
ఏడాది టైమ్‌ డిపాజిట్‌ … 5.5 శాతం వడ్డీ (మార్పు లేదు)
రెండేళ్ళ టైమ్‌ డిపాజిట్‌ … 5.5 శాతం నుంచి 5.7 శాతానికి పెంపు
మూడేళ్ళ టైమ్‌ డిపాజిట్‌… 5.5 శాతం నుంచి 5.8 శాతానికి పెంపు
అయిదేళ్ళ టైమ్‌ డిపాజిట్‌… 6.7 శాతం (మార్పు లేదు)
అయిదేళ్ళ రికరింగ్‌ డిపాజిట్‌ … 5.8 శాతం (మార్పు లేదు)
సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్‌ స్కీమ్‌ … 7.4 శాతం నుంచి 7.6 శాతానికి పెంపు
మంత్లి ఇన్‌కమ్‌ అకౌంట్‌ స్కీమ్‌ … 6.6 శాతం నుంచి 6.7 శాతానికి పెంపు
నేషనల్‌ సేవింగ్‌ సర్టిఫికెట్‌ … 6.8 శాతం (మార్పు లేదు)
పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ స్కీమ్‌ … 7.1 శాతం (మార్పు లేదు)