For Money

Business News

ఇన్ఫోసిస్‌ షేర్ల బైబ్యాక్‌

ఇన్ఫోసిస్‌ కంపెనీ ఈ నెల 13వ తేదీన షేర్ల బైబ్యాక్‌కు సంబంధించిన ప్రతిపాదనను పరిశీలించనుంది. ఇదే రోజు కంపెనీ సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల ఫలితాలను పరిగణనలోకి తీసుకోనుంది. అదే రోజున బైబ్యాక్‌ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోనుంది. ఇవాళ టీసీఎస్‌ చక్కటి ఫలితాలను ప్రకటించింది. దీంతో రేపు టీసీఎస్‌ షేరుకు మంచి డిమాండ్‌ రావొచ్చని అనలిస్టులు భావిస్తున్న సమయంలో ఇన్ఫోసిస్ ప్రకటనతో మొత్తం సీన్‌ మారిపోయింది. రేపు టీసీఎస్‌ కన్నా ఇన్ఫోసిస్‌ షేర్‌ భారీగా లాభపడే అవకాశముంది. నాస్‌ డాక్‌ దాదాపు రెండు శాతం నష్టంలో ఉన్నా.. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ ఇపుడు 2.37 శాతం లాభంతో 17.46 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.