అంచనాలను మించిన ఇన్ఫోసిస్
సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ అద్భుత పనితీరు కనబర్చింది. కంపెనీ ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను మించాయి. ఈ మూడు నెలల కాలంలో కంపెనీ రూ. 29,602 కోట్ల టర్నోవర్‌పై రూ. 5,421 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కంపెనీ ఇబిటా రూ. 6,971 కోట్లు. కంపెనీ మార్జిన్ 23.6 శాతమని కంపెనీ పేర్కొంది. ఒక్కో షేర్‌కు రూ. 15 డివిడెండ్ ఇచ్చేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది. రానున్న త్రైమాసికంలో కంపెనీ టర్నోవర్ 14 శాతం నుంచి 16 శాతం మేరకు పెరగవచ్చని కంపెనీ పేర్కొంది.