For Money

Business News

ముడి పామాయిల్‌ ఎగుమతి చేస్తాం

భారత మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. వంటనూనె ధరలు భయపడినట్లుగా పెరగడం లేదు. గతవారం పామాయిల్‌ ఎగుమతులను ఇండోనేషియా నిషేధించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఆ దేశం క్లారిటీ ఇచ్చింది. ముడి పామాయిల్‌ ఎగుమతులను తాము నిషేధించడం లేదని పేర్కొంది. అంటే ముగి పామాయిల్‌ను మనం దిగుమతి చేసుకుని ఇక్కడే రిఫైన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. నిజంగా ఇది మంచి నిర్ణయమని.. దీనివల్ల దేశీయంగా ఉన్న పామాయిల్‌ రిఫైనరీలకు మంచి పని దొరికిందని స్థానిక పామాయిల్‌ వ్యాపార సంస్థలు అంటున్నారు. అయితే రిఫైన్డ్, బ్లీచ్డ్‌, డియోడరైజ్డ్‌ (RBD) పామాయిల్ ఎగుమతులను మాత్రం ఇండోనేషియా నిషేధించడం లేదు. భారత్‌లో పామాయిల్ ధరలు పెరుగుతాయని మరికొందరు వర్తకులు అంటున్నారు. ఎందుకంటే భారత్‌ దిగుమతి చేసుకునే పామాయిల్‌లో కేవలం 8.5 శాతం మాత్రమే ముడి పామాయిల్‌ అని… దాదాపు 90 శాతం రీఫైండ్‌ ఆయిల్‌ అని అంటున్నారు. ముడి ఆయిల్‌ను తెచ్చి… రీఫైన్‌ చేసేందుకు సమయం పడుతుందని… మన అవసరాల స్థాయిలో రీఫైన్‌ చేయడం కష్టమని అంటున్నారు. సాధారణ స్థాయిలో సరఫరా రావడానికి సమయం పడుతుందని.. ఆలోగా అధిక ధరలు తప్పవని అంటున్నారు.