For Money

Business News

వంటనూనెల ధరలకు ఇక ఆకాశమే హద్దు

ప్రపంచంలోనే అతి పెద్ద పామోలిన్‌ తయారీదారు, ఎగుమతిదారు అయిన ఇండోనేషియా తమ దేశం నుంచి పామోలిన్‌ ఎగుమతులపై నిషేధం విధించారు. ఈనెల 28 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుంది. తరువాత పరిస్థితిని బట్టి నిషేధం ఎత్తివేసే అంశాన్ని పరిశీలిస్తానని దేశాధ్యక్షుడు జొకొవి (జొకొ విడొడొ) వెల్లడించారు. పామోలిన్‌ సరఫరాను తాను స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. దేశీయంగా వంటనూనెల ధరలు భారీగా పెరగడంతో ఇండోనేషియా ఈ నిర్ణయం తీసుకుంది. అనేక వంటనూనెలకు పామోలిన్ ఆధారం. ఇతర నూనెలలను పామోలిన్‌తో కలిపి అమ్ముతారు. ఇండోనేషియా నుంచి పామోలియన్‌ అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం మనదే. ఇండొనేషియా నిర్ణయంతో మన దేశంలో వంటనూనెల ప్రభావం అధికంగా పడనుంది. ముడి లేదా ఇతర రూపంలో కూడా పామోలిన్ ఎగుమతిని నిషేధించడంతో భారత్‌కు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇండోనేషియా నుంచి రీఫైన్డ్‌తోపాటు ముడి పామోలిన్‌ను కూడా భారత్‌ దిగుమతి చేసుకుంటుంది. మనదేశంలో విక్రయించే చాలా రకాల వంటనూనెలకు పామోలిన్‌ ఆధారం. వేరుశనగ నూనె ఒరిజిన్‌ ధరలు మూడు,నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది. పామోలిన్‌ కలపడంతో ఈమాత్రం ధరకు అమ్ముతున్నారు. ఇలా అనేక నూనెలలో కలిపి అమ్ముతారు. ఇండోనేషియా నిర్ణయం వెలువడిన వెంటనే అమెరికా సోయా ఆయిల్ ఫ్యూచర్స్‌ ధర 3 శాతం పెరిగి ఆల్‌ టైమ్‌ రికార్డు స్థాయికి చేరింది. ఇండోనేషియా నిర్ణయం దురదృష్టకరమైనదని, ఊహించలేదని మనదేశానికి చెందిన సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అతుల్‌ చతుర్వేది అన్నారు.ఇక ఆకాశమే హద్దుగా వంటనూనెల ధరలు పెరుగుతాయని ముంబైకి చెందిన డీలర్ ఒకరు అన్నారు. ఉక్రెయిన్‌ యుద్ధంతో సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ దిగుమతి పడిపోవడంతో చాలా వరకు వంటనూనెలు పామోలిన్‌పైనే ఆధారపడ్డాయని ఆయన అన్నారు.