For Money

Business News

కెనడా నుంచి హై కమిషనర్‌ వెనక్కి

కెనడాలోని భారత హైకమిషనర్‌ను వెనక్కి రప్పించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఆయనతో పాటు ఇతర అధికారులు, దౌత్య అధికారులను కూడా వెనక్కి వచ్చేయాలని ఆదేశించింది. కెనడా ప్రభుత్వ వైఖరితో తమ హై కమిషనర్‌తో పాటు ఇతర అధికారులు ప్రాణాలకు ముప్పు ఉందని భారత్‌ పేర్కొంది. ఇటీవల భారత హైకమిషనర్‌ సహా పలువురు దౌత్యవేత్తలను దర్యాప్తులో భాగంగా ‘పర్సన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’లుగా (అనుమానితులుగా) పేర్కొంటూ కెనడా నుంచి మన విదేశాంగ శాఖకు సమాచారం వచ్చిన విషయం తెలిసిందే. కెనడా చర్యలు పూర్తి అసంబద్ధమైనవని భారత్‌ పేర్కొంది. కెనడా ప్రభుత్వం ఇటీవల తీసుకుంటున్న చర్యలు ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య కేసులో భారత హైకమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మ పేరును అనుమానితుల జాబితాలో చేర్చినట్లుగా భారత్‌ భావిస్తోంది.