సీన్ రివర్స్… గోధుమల దిగుమతి?
నాలుగు నెలల్లోనే సీన్ మారిపోయింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి సమయంలో ప్రపంచానికి అన్నం పెడుతున్న భారత్ అంటూ తెగ ప్రచారం చేసుకున్న ప్రధాని మోడీకి గట్టి షాక్ తగిలింది. వేసవిలో అధిక ఉష్ణోగ్రత కారణంగా గోధమల దిగుమతి తగ్గింది. ఇపుడు ఖరీఫ్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో పంట విస్తీర్ణం తగ్గుతోంది. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో గోధమల ధరలు పెరుగుతున్నాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) వద్ద ఆహర ధాన్యాల నిల్వలు తగ్గినట్లు బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ పేర్కొంది. గత 14 ఏళ్ళలో ఎన్నడూ లేని స్థాయికి నిల్వలు పడిపోయాయని పేర్కొంది. దీంతో గోధమల దిగమతి అంశాన్ని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రభుత్వ అధికారులు ఇప్పటికేఉ ఆ మేరకు సన్నాహాలు ప్రారంభించినట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ప్రస్తుతం గోధుమల దిగుమతిపై 40 సుంకం ఉంది. పిండి మిల్లర్ల సౌలభ్యం కోసం ఈ సుంకాన్ని ఎత్తివేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.