సుంకాలు తగ్గించనున్న భారత్

ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు ముందు భారత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న సుమారు 32 వస్తువులపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. తమ దేశ ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తోందని గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 13న ట్రంప్‌తో మోడీ భేటీ కానున్నారు. మరోవైపు భారత్ వస్తువులపై సుంకాలను ఏక్షణమైనా అమెరికా పెంచవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా వస్తువులపై సుంకాలు తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. హై ఎండ్ బైక్స్, లగ్జరీ కార్లు, కెమికల్స్‌పై భారత్ సుంకాలను తగ్గించే అవకాశముంది. గత బడ్జెట్‌లో కేంద్రం అనేక వస్తువులపై సుంకాలను తగ్గించింది. వీటిలో చాలా వస్తువులు అమెరికా నుంచి దిగుమతి అవుతున్నవే. లగ్జరీ కార్లు, సోలార్ సెల్స్, మెషినరీలపై దిగుమతి సుంకాన్ని 150 శాతం నుంచి 70 శాతానికి భారత్ తగ్గించింది.