For Money

Business News

18 వేల మంది భారతీయులు వెనక్కి?

అమెరికాలో అక్రమంగా ఉంటున్న 18వేల మంది భారతీయులను భారత్‌ వెనక్కు తీసుకురానుంది. అమెరికా వాణిజ్య యుద్ధం తలెత్తకుండా ఉండేందుకు గాను… అమెరికాలో ఉన్న అక్రమ వలస భారతీయులను వెనక్కి తీసుకోవాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. 2022 నాటికి తమ దేశంలో 2.2 లక్షల మంది భారతీయులు అక్రమంగా ఉంటున్నారని అమెరికా అంటోంది. అయితే తక్షణం 18వేల మందిని భారత్‌ వెనక్కు తీసుకురానుంది. ఈ మేరకు ఏర్పాట్లను కూడా ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి ఒప్పందాలను సౌదీ అరేబియా, జపాన్‌ వంటి దేశాలతో భారత్‌ కుదుర్చుకుంది. చైనాతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీ ఎత్తున సుంకాలు విధించాలని అమెరికా భావిస్తోంది. ఈనేపథ్యంలో అమెరికాతో వాణిజ్య యుద్ధానికి తెర లేపకుండా అక్రమ వలసదారులను వెనక్కి తీసుకోవాలని భారత్‌ ప్రతిపాదించింది.