బంగారు నగల డిమాండ్ 49 శాతం పెరిగింది
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం అంటే ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో భారత్‌లో 140.3 టన్నుల నగలు కొనుగోలు చేసినట్లు ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ (WGC) వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో నగల డిమాండ్ కేవలం 94 టన్నులు మాత్రమే. మొత్తం బంగారం డిమాండ్ 43 శాతం పెరిగి 119.6 టన్నుల నుంచి 170.7 టన్నులకు చేరినట్లు WGC వెల్లడించింది. ఈ మూడు నెలల్లో భారత్‌లో బంగారం ట్రెండ్‌పై WGC ఓ నివేదికలో వివరించింది. అదే విలువ లెక్కన చూస్తే గత ఏడాది ఈ మూడు నెలల్లో రూ. 51,540 కోట్ల బంగారం కొనుగోలు చేయగా, ఈ ఏడాది అదే మూడు నెలల్లో రూ. 79,270 కోట్ల విలువైన బంగారు నగులు కొనుగోలు చేశారు. అక్షయ తృతియ, పెళ్ళి సీజన్ కారణంగా ఈ మూడు నెలల్లో బంగారానికి మంచి డిమాండ్ వచ్చినట్లు పేర్కొంది. ఈ ఏడాది మార్చి 31వ తేదీన పది గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర రూ.43,994 ఉండగా, జూన్ 30వ తేదీన ధర రూ. 46,504గా ఉండని WGC వెల్లడించింది.