కేంద్రం అప్పులు రూ. 147 లక్షల కోట్లు!
బీజేపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం అప్పులు జెట్ స్పీడ్తో పెరుగుతున్నాయి. సెప్టెంబర్ నెలాఖరుకు కేంద్రం అప్పులు రూ. 147.19 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. అంతకుమునుపు అంటే జూన్ నెలాఖరున కేంద్రం అప్పులు రూ. 145.72 లక్షల కోట్లని వెల్లడించింది. రూ. 147 లక్షల కోట్లలో 89.1 శాతం పబ్లిక్ డెట్ అంటే మార్కెట్ నుంచి తీసుకున్న రుణాలని వెల్లడించింది. కేంద్రం చెల్లించాల్సిన మొత్తం అప్పుల్లో 29.6 శాతం అప్పులు వచ్చే అయిదేళ్ళలోపే చెల్లించాల్సి ఉంది. జులై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం రూ. 4.05 లక్షల కోట్ల అప్పు చేసింది. రూ. 92,371 కోట్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. తీసుకున్న రుణాలపై కేంద్రం ఇపుడు 7.33 శాతం చొప్పున వడ్డీ చెల్లించనుంది.