మండలి ఓటింగ్‌కు భారత్ డుమ్మా
ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో తాజా పరిస్థితిపై చర్చించేందుకు వెంటనే ఐక్యరాజ్య సమితి సమావేశం నిర్వహించాలన్న అమెరికా ప్రతిపాదనపై భద్రతా మండలిలో ఇవాళ ఓటింగ్ నిర్వహించారు. రష్యా వీటో చేయగా… భారత్, చైనా. యూఏఈ గైర్హాజరయ్యాయి. ఈ ఓటింగ్‌లో తీర్మానానికి మద్దతుగా 11 ఓట్లు పడ్డాయి. రెండు రోజుల క్రితం జరిగిన భద్రతా మండలిలో కూడా ఇదే తరహా ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే.15 మంది సభ్యులు ఉన్న కౌన్సిల్లో ఇవాళ జరిగిన ఓటింగ్ కేవలం లాంఛన ప్రాయమే. శాశ్వత సభ్యులైన చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికా వీటో ఉపయోగించినా విధానపరమైన తీర్మానాల విషయంలో ప్రయోజనం ఉండదు. 193 మంది సభ్యులు ఉన్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం త్వరలోనే జరుగనుంది. తేదీ ఖరారు కానుంది.