రియల్టీ పెట్టుబడులు అప్
ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రియల్టీ రంగంలో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు 17 శాతం పెరిగాయి. జులై–సెప్టెంబర్ మధ్య కాలంలో 72.1 కోట్ల డాలర్ల (సుమారు రూ. 5,430 కోట్లు)కు చేరినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. హౌసింగ్ తో పాటు డేటా సెంటర్, వేర్‌హౌసింగ్ ప్రాజెక్టులకు భారీగా ప్రవహించినట్లు పేర్కొంది. ఆర్‌ఈఐటీలలో కూడా యాంకర్ ఇన్వెస్టర్లు సైతం చేరినట్లు వెల్లడించింది. దేశంలో అనిశ్చితులు, పలు అవాంతరాల నేపథ్యంలో కూడా ఈ త్రైమాసికంలో 17 శాతం పెట్టుబడులు రావడం విశేషమని ప్రస్తావించింది. ఇక వచ్చిన పెట్టుబడుల్లో రెసిడెన్షియల్ రంగంలో 21.1 కోట్ల డాలర్లు వెళ్ళాయి. డేటా సెంటర్‌కు 16.1 కోట్ల డాలర్లు, మిక్స్డ్ వినియోగ ప్రాజెక్టులకు 13.7 కోట్ల డాలర్లు చొప్పున అందినట్లు జేఎల్ఎల్ పేర్కొంది.