అంతర్జాతీయ బులియన్ ఎక్స్ఛేంజి నేడు ప్రారంభం
మరో వ్యాపార సంస్థ గుజరాత్‌కు వెళ్ళింది. ఆర్థిక రాజధాని లేదా దేశ రాజధాని కాదని గుజరాత్లో మనదేశపు తొలి ఇండియా అంతర్జాతీయ బులియన్ ఎక్స్ఛేంజ్ (Indiai International Bullion Exchange -IIBX)ను ఇవాళ ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఇవాళ్టి నుంచి ప్రధాని గుజరాత్ పర్యటిస్తున్నారు. గాంధీనగర్‌లోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ (గిఫ్ట్ సిటీ)లో ప్రారంభించనున్నారు. షేర్ మార్కెట్లో మాదిరిగానే బంగారం స్పాట్ డెలివరీ కాంట్రాక్ట్‌తో పాటు బులియన్ డిపాజిటరీ రిసీట్స్‌ను ఈ ఎక్స్ఛేంజీ ఆఫర్ చేస్తుంది. ఎలాగైతే కమాడిటీ మార్కెట్లో ఆహార, వాణిజ్య వస్తువుల ఆధారంగా ట్రేడింగ్ జరుగుతుందో అలాగే బులియన్ ఆధారంగా ఇక్కడ ట్రేడింగ్ జరుగుతుంది. సాధారణ బులియన్‌కు భిన్నంగా ఈ ఎక్స్ఛేంజీలో బంగారం వెండి కొనుగోళ్ళతో పాటు డెరివేటివ్స్ ట్రేడింగ్ కూడా ఉంటుంది. ఈ ఎక్స్ఛేంజీని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ నిర్వహిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. బంగారం, వెండి ఆధారంగా స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌కు వీలు కల్గుతుంది. బంగారం, వెండిలో స్పాట్‌తోపాటు ఫ్యూచర్స్, ఆప్షన్స్ కూడా ఈ ఎక్స్ఛేంజీలో ట్రేడవుతాయన్నమాట.