బెదిరింపుల వల్ల పార్టీలకు రూ.40 కోట్ల విరాళం!
కోల్‌కతా చెందిన ప్రముఖ లిక్కర్ కంపెనీ ఐఎఫ్బీ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ నిన్న స్టాక్ ఎక్స్ఛేంజీలకు రాసిన లేఖ ఇపుడు స్టాక్ మార్కెట్‌తో పాటు రాజకీయ వర్గాల్లో కలకలం రేగుతోంది. కంపెనీ ఎదుర్కొంటున్న ఎక్సైజ్‌కు సంబంధించి అడ్డం పెట్టుకుని కొందరు తమను బెదిరిస్తున్నారని లేఖలో పేర్కొంది. దీంతో మార్చి 31వ తేదీన జరిగిన బోర్డు సమావేశంలో రాజకీయ పార్టీలకు ఎలక్టరోల్ బాండ్ల రూపంలో రూ. 40 కోట్లు చెల్లించేందుకు నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. అంటే రూ.40 కోట్ల రాజకీయ విరాళాలు ఇవ్వనుందన్నమాట. ఇటీవలి కాలంలో కేంద్ర ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల రూపంలో తాము చెల్లిస్తామని కంపెనీ పేర్కొంది. దీనిపై ఇపుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. ఐఎఫ్బీ ఆగ్రో ఇండస్ట్రీస్‌ను ఏ రాజకీయ పార్టీ బెదిరిస్తోందని ఇన్వెస్టర్లతో పాటు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మద్యం తయారు చేసే కంపెనీలకు రాష్ట్ర ఎక్సైజ్ విభాగంతోనే పని ఉంటుంది. అంటే పరోక్షంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బెదిరిస్తోందని కంపెనీ చెప్పదల్చుకుందా అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే కంపెనీ రాజకీయ పార్టీలకు విరాళం ఇవ్వడం కొత్తకాదని… గతంలోనే ఇదే కారణంతో విరాళాలు ఇచ్చిందని మరికొందరు అంటున్నారు.