For Money

Business News

మద్యంపై 25 శాతం డిస్కౌంట్‌!

ప్రైవేట్‌ మద్యం దుకాణాలు 25 శాతం వరకు డిస్కౌంట్‌ ఇచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రైవేట్‌ మద్యం షాపుల మధ్య అనారోగ్యకర పోటీ నెలకొనడంతో గత ఫిబ్రవరిలో మద్యంపై ఎలాంటి డిస్కౌంట్‌లపై నిషేధం విధించింది. దీన్ని సడలిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. జనం తమకు మెచ్చిన బ్రాండ్లు కొనుగోలు చేయడంతో పాటు ప్రైవేట్‌ వైన్‌ షాపుల మధ్య ఆరోగ్యకర పోటీ ఉండాలని డిస్కౌంట్‌తో మద్యం అమ్మేందుకు అనుమతించింది. దీనివల్ల కొనుగోలుదారులకు తక్కువ ధరకే మద్యం అందుతుందని భావించింది. అయితే దీన్ని ప్రైవేట్‌ దుకారణాలు దుర్వినియోగం చేశాయి. భారీ డిస్కౌంట్‌ ఇవ్వడంతో పాటు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వంటి స్కీములు ప్రవేశపెట్టడంతో… షాపుల వద్ద జనం క్యూగట్టారు. కొన్నిచోట్ల రద్దీ అధికంగా ఉంది. పైగా ఈ డిస్కౌంట్‌ స్కీము ఎత్తేస్తారేమోనని జనం భారీ ఎత్తున కొని దాచడం ప్రారంభించారు. కరోనా సమయంలో ఇలాంటి రద్దీని అరికట్టేందుకు మద్యం డిస్కౌంట్‌లపై ప్రభుత్వం నిషేధం విధించింది. తాజాగా షరతులతో 25 శాతం వరకు డిస్కౌంట్‌ ఇచ్చేందుకు అనుమతించింది. ఢిల్లీ ఎన్‌సీటీ ప్రాంతంలో 849 ప్రైవేట్‌ రీటైల్‌ మద్యం షాపులు ఉన్నాయి.