సెబీ చీఫ్‌కు బ్యాంక్ నుంచి జీతం?
సెబీ చీఫ్‌గా ఉన్న మాధవి పురీ బుచ్ ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి జీతం తీసుకుంటున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ఆయన ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మాధవిపై తీవ్ర ఆరోపణలు చేశారు. సెబీ ఛైర్‌పర్సన్‌గా ఉంటూనే ఆమె ఆమె ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి 2017-2024 మధ్య మధ్య కాలంలో రూ. 16 కోట్లకు పైగావేతనం తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాలకిందకే వస్తుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఒక కంపెనీలో పనిచేస్తూ ఒకచోట మాత్రమే వేతనం తీసుకోవాల్సి ఉంటుందని..అయితే సెబీ చీఫ్ విషయంలో అలా జరగడం లేదని ఆయన ఆరోపించారు. 2017 నుంచి సెబీ సభ్యురాలిగా ఉన్న మాధవి 2022లో ఆ సంస్థ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి 2017-2024 మధ్య కాలంలో ఆమె ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లు కూడా తీసుకున్నారని పవన్ ఖేరా పేర్కొన్నారు. సెబీ చీఫ్‌గా ఉన్న సమయంలో ఆమె పలు వివాదాల్లో ఐసీఐసీఐ బ్యాంక్‌కు అనుకూలంగా తీర్పులు ఇచ్చారని ఆయన విమర్శించారు. జీతంఅందుతుండడం వల్లే ఐసీఐసీఐ బ్యాంక్‌పై వచ్చిన పలు విచారణలు నిలిచిపోయాయని ఆయన ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు.